Thursday, January 23, 2025

సావర్కర్ పోరాటం స్ఫూర్తిదాయకం : విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ దేశభక్తి .. జాతీయ భావం కలిగి ఉండాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థాను మలయన్ కోరారు. స్వాతంత్ర సమరయోధులు వినాయక్ దామోదర్ సావర్కర్ 140వ జయంతిని విహెచ్‌పి ఘనంగా నిర్వహించింది. ఆదివారం కాచిగూడలో గల సావర్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం వీర సావర్కర్ చేసిన పోరాటంప్రతి భారతీయుడు తెలుసుకోవాలన్నారు.

ఆంగ్లేయులు విధించిన అతి భయంకరమైన శిక్షణ అనుభవించి దేశం కోసం పోరాడిన మహనీయుడు సావర్కర్ అని కొనియాడారు. అండమాన్ జైల్‌లో క్రూరమైన శిక్షణ విధించినా ఈ మాత్రం వెరవకుండా పోరాడిన మహనీయుడు సావర్కర్ అన్నారు. సావర్కర్ పుస్తకం చదవాలని.. లేదంటే సావర్కర్ సినిమా చూడాలని ఆయన ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు పండరీనాథ్, జగదీశ్వర్, పగుడాకుల బాలస్వామి, శివరాములు, పిట్ల స్వామి, వెంకట్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News