Friday, November 15, 2024

శ్రీ విఘ్నశ్వర దండకం

- Advertisement -
- Advertisement -

Vinayaka-chavithi

శ్రీపార్వతీపుత్ర, లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేవక్త్రా, మహాకాత్యాయనీ నాథ సంజాత స్వామీ, శివా, సిద్ధి విఘ్రేశ, నీ పాద పద్మంబులన్, నీదు కంఠంబు, నీ బొజ్జ, నీ మోము, నీ మౌళి బాలేందు ఖండబులు, నాల్గు హస్తంబులున్నీ కరాళంబు, నీ పెద్ద వక్త్రంబు, నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మంద హాసంబు నీ చిన్ని తొండంబు, నీ గుజ్జు రూపంబు, నీ శూర్పకర్ణంబు, నీ నాగయజ్ఞోపవీతంబు, నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ కుంకుమాక్షతల్ జాజులున్ పంకజంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులున్ తెల్ల గన్నేరులున్ మంకెన ల్ పొన్నలున్ పువ్వులున్ మంచి దూర్వమ్ము తెచ్చి శాస్త్రోక్త రీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్ మంచివౌనిచ్చు ఖండంబులున్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేతి బూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ వడలు పుణుగులు బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్ నానుబియ్యంబునామ్రంబు బిల్వంబు మేల్బంగరున్

పళ్లెమందుంచి నైవేద్యమున్ పంచ నీరాజనంబుం నమస్కారాముల్ చేసి విఘ్నేశ్వరా నిన్ను పూజింపక అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుటల్ కాంచనంబొల్లకే ఇమ్ము దాగోరు చందంబు గాదే మహా దేవ ఓ భక్త మందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణీ లోక రక్షామణీ బంధు చింతామణీ స్వామీ నిన్నెంచ నేనెంత నీ దాసదాసానుదాసుండ శ్రీదాంతరాజాన్వరాయుండ రామాభిదాసుండ నన్నెప్పుడున్ చేపట్టి సుశ్రేయునిన్ జేసి శ్రీమంతుగా చూసి హృత్పద్మ సింహాసనారూఢత నిల్పి కాపాడుటే కాదు నిన్ గొల్చి ప్రార్థింతు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిం రెప్పవై బుద్ధియు విద్యయు పాడియున్ పంటయున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ తగన్ కల్గగా చేసి పోషించుమంటిన్ కృపన్ కావుమంటిన్ మహాత్మా ఇవే వందనంబుల్ శ్రీగణేశ నమస్తే నమస్తే నమస్తే నమః

Vinayaka Chavithi Celebrations 

Telangana news

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News