Tuesday, September 17, 2024

వినాయకుని దండకము

- Advertisement -
- Advertisement -

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్సుణ్యచారిత్ర, భద్రేభవక్షా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ వివా సిద్ధివిఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీబొజ్జ నీమోము నీ మౌళి బాలేందు ఖండంబు నీనాల్లు హస్తంబులు న్నీ కరాళంబు నీ పెద్ద వక్తంబు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్
సదామూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు
నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్టోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి
మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమం బక్షతల్ జూజులున్ చంపకంబుల్ తగన్
నీ మొల్లలు న్మంచి చేమంతులున్ తెల్ల గన్నేరులున్ మంకెనల్ పొన్నలున్
పువ్వులున్మంచి దూర్వంబుళం దెచ్చి శాస్తో క్తరీతిన్ సమర్పించి పూజించి
సాష్టాంగంమున్ జేసి విఘ్నేశ్వరా టెం కాయ పొన్నంటి పండ్లున్ మరిస్మంచివౌ
ఇక్షుఖండంబులన్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేతి బూరెల్ మరిన్ గోధుమప్పంబుల్
న్వడల్ పున్గులన్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలజ్యమున్నాను బియ్యంబు చామ్రం బు బిల్వంబు కుడుముల్ వడపప్పు
పానకంబున్ మేల్ బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యనర్పించి నీరాజనంబున్
నమస్కారముల్లేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబులన్ ప్రార్ధన
ల్చేయుటల్ కాంచనం బోల్లకే యున్ముడా గోరుచందంబు గాదే! మహాదేవ యో
భక్తమందార యో సుందరకార యో భాగ్య గంభిర యో దేవచూడామణీ లోక రకామణి
బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనంత నీ దాస దాసాది దాసుండ శ్రీ దొంత
రాజాన్వయుండ రామాభిధానుండ నన్నిప్పుడు చేపట్టి సుశ్రేయునిం జేసి
శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్ నిల్చి కాపాడుటే కాదయ నిన్
గొల్చి ప్రార్ధించు. భాక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్
విద్యయున్ పాడియున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్లగా జేసి పోషించు మంటిన్
గృపన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీగణేశా నమస్తే నమస్తే నమః

ఓం ప్రాణాయస్వాహ.. ఓం అపానాయస్వాహా
ఓం వ్యానాయస్వాహా.. ఓం ఉదానాయస్వాహా
ఓం సమానాయ స్వాహా..
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ( అని నీళ్ళు వదలాలి.)
అమృతాపిథానమసి.. ఉత్తరాపోశనం సమర్పయామి..
హస్తౌ ప్రక్షాళయామి.. పాదౌ ప్రక్షాళయామి..
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి అంటూ నీళ్ళుచల్లాలి

అథ అంగపూజ..
గణేశాయ నమః పాదౌ పూజుయామి
ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః; జంఘౌ పూజయామి
అఖువాహనాయ నమ; ఊరూం పూజయామి
హేరంబాయ నమః కటిం పూజయామి
లంబోదరాయ నమః ఉదరం పూజయామి
గణనాథాయ నమః నాభిం పూజయామి
గణేశాయ నమః హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి
స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి
గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః నేత్ర పూజయామి
శూర్ఫ కర్ణాయ నమః కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి
అథ ఏకవింశతి పత్ర పూజ
(ఓక్కొక్క నామం చదువుతూ పత్రాలతో స్వామిని పూజించాలి)
ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి(వాకుడు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి (రేగు)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః వట పత్రం పూజయామి (మర్రి)
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమఃవిష్ణు క్రాంత పత్రం పూజయామి
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
ఓం ఫాల చంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధూవార పత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి
ఓం ఇభ వక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి(మద్ది)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతిపత్రాణి పూజయామి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News