Tuesday, September 17, 2024

వినాయకుడి కలశ పూజ ఎలా చేయాలో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం, శ్రీవిఘ్నేశ్వర పూజాం కరిష్యే. అని చెప్పి అక్షతలు నీళ్ళు వదలాలి.
కలశానికి గంధం, కుంకుమతో బొట్టుపెట్టి కలశంలో గంధం, పువ్వులు, అక్షతలు వేయాలి.

దేవతీర్థాద్యావాహనము
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర నమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌతుసాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరాః
రుగ్వేదోథయజుర్వేదః సామవేదోహ్యధర్వణ:
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
కలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతూ …
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !! కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరధీ తివిఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః కలశోదకేన దేవం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య
ఏవమాత్మానంచ సంప్రోక్ష్య

తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యాల మీదా, దేవుడిమీద, తమమీద కొద్దిగా చిలకరించుకోవాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమోనమః
ప్రాణప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తోస్తు..

అని గణపతి విగ్రహంపై అక్షతలు వేయాలి.
స్థిరోధవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని అక్షితలు వేసి నమస్కారం చేయాలి.

 

పువ్వులు రెండు చేతుల్లోకి తీసుకుని..
గణానాంత్వా గణపతిగ్‌ే్మ హవామహే, కవిం క వీనామ్ ఉపమశ్రవస్తవమ్!
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాధనం!!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
పాదయో: పాద్యం సమర్పయామి.. హస్తయో: ఆర్ఘ్యం సమర్పయామి
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి
ఉపచారిక స్నానం.. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు కొద్దిగా గణపతిమీద చల్లాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి,
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీగంధాన్ ధారయామి,
శ్రీ మహాగణాధిపతయే నమః పుప్పై: పూజయామి
శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి
(ధూపం చూపించాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి
(దీపం చూపించాలి)
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి
(హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోవాలి)
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి: ప్రచోదయాత్
శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః ఛత్రమచ్చాదయామి
చామరం వీచయామి.. నృత్యం దర్శయామి
గీతామాశ్రావయామి.. వాద్యం ఘోషయామి ..
అశ్వానారోహయామి .. గజానారోహయామి ..
శకటానారోహయామి .. ఆందోళికానారోహయామి ..
అని అక్షితలు వేయాలి

సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి …
అని నీళ్ళు అక్షితలు పళ్ళెంలో వదలాలి.
శ్రీ మహాగణపతి దేవతా సుప్రీత సుప్రసన్నోవరదో భూత్వా వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నుమస్త్వితి భవంతో భ్రువంతు ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు.
మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
పసుపు గణపతి పూజాక్షతలు శిరసున ధరించాలి.
శ్రీమహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి
శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయచ .. అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇక్కడికి హరిద్రా గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది.

వరసిద్ధి వినాయకవ్రత ప్రారంభం..
ఓం శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ: ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు అని మట్టిగణపతి విగ్రహం దగ్గర అక్షతలు వేయాలి.
స్వామిన్ సర్వజగన్నాథ యావత్సూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు!!
స్థిరోభవ వరదోభవ ప్రసీద ప్రసీద
(అని వినాయకుడి విగ్రహం దగ్గర అక్షతలు,
పూలు వేసి నమస్కరించాలి)

ఆసనం..
మౌక్రికై: పుష్యరాగైశ్చ నానారె్త్నైర్విరాజితం
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
ఆసనం సమర్పయామి (అక్షతలు లేదా పూలు వేయాలి)
అర్ఘ్యం..
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః
అర్ఘ్యం సమర్పయామి (తమలపాకుతో స్వామిపైన నీళ్ళు చల్లాలి)
పాద్యం..
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్తాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః
పాద్యం సమర్పయామి (మళ్ళీ కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి)
ఆచమనీయం ..
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనందేవా తుభ్యందత్తం మయా ప్రభో
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః
ఆచమనీయం సమర్పయామి (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
మధుపర్కం..
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః
మధుపర్కం సమర్పయామి
(పత్తి లేదా దూది)తో చేసిన పెద్ద వత్తికి మధ్యమధ్యలో పసుపు, కుంకుమ పూసి స్వామివారికి సమర్పించాలి)
స్నానం…
పంచామృతైర్దేవ గృహాన గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి
(తేనె, పెరుగు, నెయ్యి, పాలు, చెరుకురసం కలిపి స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరి కాయ కొట్టి ఆ నీటిని స్వామివారిపై చల్లాలి)

గంగాది సర్వతీర్ధేభ్యః అహృతైరమలైర్జలై:
స్నానం కురుష్వభగవన్ ఉమాపుత్ర నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః

శుద్దోదక స్నానం సమర్పయామి (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
వస్త్రం..
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః
వస్త్రయుగ్మం సమర్పయామి (నూతన వస్త్రం లేదా పత్తికి పసుపు, కుంకుమ రాసి దాన్నే వస్త్రంగా సమర్పించాలి)
యజ్ఞోపవీతం..
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం
గృహాన దేవా సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి (దూదితో చేసిన పెద్ద వత్తికి మధ్యమధ్యలో పసుపు, కుంకుమ పూసి స్వామివారికి సమర్పించాలి)
గంధం..
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతామ్
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః
గంధం సమర్పయామి (గంధం స్వామిపై చిలకరించాలి
అక్షతలు..
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్
గృహాన పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః
అక్షతాన్ సమర్పయామి (కొ న్ని అక్షతలు వేయాలి)
పుష్పాలు..
సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాచి చ
ఏకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
ఓం వరసిద్ధివినాయకస్వామినే నమః
పుష్పాణి సమర్పయామి (స్వామిని పూలతో అలంకరించాలి, పూజించాలి)
సింధూరం..
ఉద్యద్భాస్కర సంకాశం సంధ్యా వదబుణంప్రభో !
వీరాలంకరణం దివ్యం సింధూరం ప్రతిగృహ్యతాం !!
వరసిద్ధి వినాయకాయ, సింధూర భూషణం సమర్పయామి
మాల్యం..
మాల్యాదీని సుగంధాని మాలత్యా దీనివై ప్రభో!
మాయాహృతాని పుష్పాణి ప్రతిగృహ్లీష్వ శాంకర !!
వరసిద్ధి వినాయకాయ, పుష్పమాల్యాని సమర్పయామి.
నైవేధ్యం..
ఓం భూర్చువస్సువః తత్సవితువరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యం త్వర్తేన పరిషించామి
(అని నైవేధ్యం చుట్టూ నీళ్ళు తిప్పాలి.)

అమృతమస్తు అని పసుపు గణపతి దగ్గర నీళ్ళు వదలాలి. అమృతోపస్తరణమసి అని నైవేద్యంపైన నీళ్ళు చల్లి..
శ్రీ మహాగణాధిపతయే నమః నారికేళ సహిత కదళీఫల సహిత గుడోపహారం నివేదయామి అంటూ అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామికి చేత్తో చూపించాలి.

షోడశోపచార పూజ..
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమాహం భజే!
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్!!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్!!

ధ్యానం..
ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్చుజం మహాకాయం సర్వాభరణ భూషితమ్!!!
ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః
ధ్యాయామి ధ్యానం సమర్పయామి

ఆవాహనం..
అత్రాగచ్చ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ
ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః ఆవాహయామి (అక్షతలు వేయాలి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News