Friday, November 22, 2024

పాతబస్తీలో వినాయక నిమజ్జనం…. భారీ భద్రత

- Advertisement -
- Advertisement -

Aerial survey of ministers on Ganesh immersion

 

హైదరాబాద్: పాతబస్తీలో వినాయక నిమజ్జన సందర్భంగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీలో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన చోట అదనపు క్రేన్లు ఏర్పాటు చేశారు. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం భారీ క్రేను ఏర్పాటు చేశారు. వ్యర్థాలు వెలికి తీసేందుకు అందుబాటులో 20 జెసిబిలు ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ ఉన్న సిసి కెమెరాలతో పాటు అదనంగా మరికొన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయున్నామని పోలీసులు తెలిపారు. ఎన్‌టిఆర్, ట్యాంక్‌బండ్‌లో జిహెచ్‌ఎంసి, విద్యుత్, వైద్య శాఖల సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. షా అలీ బండ, అలియాబాద్, లాల్ దర్వాజ, ఫలక్‌నుమా, నాగుల్ చింత, చాంద్రాయణగుట్ట, హుస్సేనీ అలం ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పాతబస్తీలో రెండు వేలకు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ విభాగాలతో పోలీసులు సమన్వయం చేసుకున్నారు. వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. గణేష్ శోభాయాత్ర మార్గంలో సిసి కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపి నిమజ్జనం పర్యవేక్షించనున్నారు. ఇటీవల పాతబస్తీలో జరిగిన అల్లర్ల దృష్టా పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News