భారత క్రికెట్ దిగ్గజం సచిన్
ముంబై: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాసటగా నిలిచాడు. వినేశ్ రజత పతకానికి అర్హురాలేనని..కాస్ తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్టు సచిన్ పేర్కొన్నాడు. వినేశ్‌పై అనర్హత వేటుపడడం, ఆమె పతకం సాధించే అవకాశం కోల్పోవడం తనను ఎంతో బాధించిందన్నాడు. వినేశ్‌కు రజత పతకం ఇవ్వాల్సిందేనని సచిన్ సూఇంచాడు. ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనన్నాడు. అంపైర్ తీర్పునకు సమయం అసన్నమైందన్నాడు. వినేశ్‌కు కచ్చితంగా రజతం వస్తుందనే నమ్మకాన్ని సచిన్ వ్యక్తం చేశాడు. ప్రతి ఆటలోనూ నియమాలుంటాయి. వాటిని సందర్భోచితంగా చూడాల్సి ఉంటుంది.
స్వచ్ఛమైన ఆటతీరుతో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్స్‌కు ముందు అదనపు బరువును కలిగివుందనే కారణంతో నిర్వాహకులు వినేశ్‌పై అనర్హత వేటువేశారు. ఈ క్రమంలో నిర్వాహకులు వ్యవహరించిన తీరును సచిన్ తప్పుపట్టాడు. అనర్హత వేటు వేసేందుకు సహేతుక కారణం కనిపించడం లేదన్నాడు. వినేశ్ విషయంలో ఒలింపిక్ నిర్వాహకులు పెద్ద తప్పిదానికి పాల్పడ్డారని సచిన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. కాగా, కాస్ తీర్పు కోసం తాను కూడా ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నానని, తీర్పు వినేశ్‌కు అనుకూలంగా వస్తుందనే తాను భావిస్తున్నటుట సచిన్ అభిప్రాయపడ్డాడు.