Wednesday, January 22, 2025

కల చెదిరింది

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కల చెదిరిపోయింది. ఫైనల్ కు ముందు బరువు కొలతల్లో తేడా ఉన్నట్టు నిర్ధరించిన ఒలింపిక్ సంఘం వినేశ్ ఫొ గాట్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో వినేశ్‌తో పాటు కోట్లాది మంది భారతీయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పారి స్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో వినేశ్ మహిళల 50 కిలోల ఫ్రిస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. బుధవా రం రాత్రి వినేశ్ స్వర్ణం కోసం పోటీ పడాల్సి ఉంది. అయితే బుధవారం ఉదయం ఆమె బ రువును కొలిచిన నిర్వాహకులు 100 గ్రాము లు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ని బంధనల ప్రకారం వినేశ్‌పై వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ సమాఖ్యలు నిర్ణయం తీసుకున్నాయి.దీంతో వినేశ్ ఒలింపిక్స్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అనర్హత వేటు పడడంతో వినేశ్ ఫైనల్‌కు చేరినా క నీసం రజతం కూడా సాధించే ఛాన్స్ లేకుండా పోయింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పె రగడంతో వినేశ్‌పై వేటు పడింది. వినేశ్‌పై వే టు పడడంతో భారత అభిమానులు నిరాశకు లోనయ్యారు. కోట్లాది మంది అభిమానులు వి నేశ్‌కు అండగా నిలిచారు. ఒలింపిక్ కమిటీ తీ సుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. వినేశ్‌పై తీసుకున్న కఠిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని ఆమెను ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని ఒలింపిక్ నిర్వాహకులను కోరుతున్నారు.

ప్రధాని ఓదార్పు..
అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వి నేశ్ పొగాట్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓదార్చారు. ఈ విషయంలో ట్విటర్ వే దికగా స్పందించిన ప్రధాని మోడీ వినేశ్‌కు ధై ర్యం చెప్పారు. వినేశ్..నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. కోట్లాది మంది భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో
బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నాకు మాటలు రావడం లేదు. కానీ, ఈ బాధ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడి బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం అంటూ మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. అంతేగాక ఈ విషయంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో కూడా ప్రధాని మాట్లాడారు. అంతేగాక అంతేగాక వినేశ్ అనర్హతకు తారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. దీంతోపాటు దీన్ని సవాల్ చేసేందుకు భారత్‌కు ఉన్న అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News