Wednesday, January 22, 2025

వినేశ్ భావోద్వేగ ట్వీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురై పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) బుధవారం కొట్టి వేసిన సంగతి తెలిసిందే. కాస్ తీర్పు అనంతరం వినేశ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. కాస్ తీర్పు ఎంతో మనో వేదనకు గురిచేసిందనే అర్థం వచ్చేలా పారిస్ ఒలింపిక్స్‌లో మ్యాచ్‌పై కిందపడి కన్నీళ్లు తుడుచుకుంటున్న ఫొటోను వినేశ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

ఈ పోస్టును చూసిన నెటిజన్లు వినేశ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. వినేశ్ లాంటి డైమండ్ ఉండగా..మాకు స్వర్ణం ఎందుకు? మా అసలైన ఛాంపియన్ నున్వే.. నువ్వు మహిళల రెజ్లింగ్‌లో లెజెంట్ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా, మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరింది. అయితే 100 గ్రాములు అధికంగా బరువు కలిగివుందనే కారణంతో నిర్వాహకులు వినేశ్‌పై అనర్హత వేటు వేశారు. దీంతో వినేశ్‌తో పాటు కోట్లాది మంది భారతీయులు ఎంతో మనోవేదనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News