Friday, November 22, 2024

రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం ఖాయం

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్‌లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. మహిళల 50 కిలోల ఫ్రిస్టయిల్ విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో భారత్‌కు ఈ విభాగంలో కనీసం రజత పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో వినేశ్ 50 తేడాతో యుస్నిలిస్ (క్యూబా)పై విజయం సాధించి తుది పోరుకు దూసుకెళ్లింది. సెమీస్‌లో వినేశ్ అసాధారణ ఆటను కనబరిచింది. అద్భుత ప్రతిభతో లోపెజ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వినేశ్ ధాటికి లోపెజ్ ఎదురు నిలువలేక పోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో వినేశ్ అలవోక విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో 75 తేడాతో లివచ్ ఒక్సానా (ఉక్రెయిన్)పై సంచలన విజయం అందుకుంది. లివచ్‌తో కాస్త పోటీ ఎదురైనా వినేశ్ అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఇక ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్, టోక్యో స్వర్ణ పతక విజేత సుసాకీ (జపాన్)ను వినేశ్ మట్టికరిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News