Wednesday, January 22, 2025

క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న వినేశ్ ఫోగట్

- Advertisement -
- Advertisement -

పారిస్‌: భారత ఏస్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌… నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌, స్వర్ణ పతక విజేత అయిన జపాన్‌కు చెందిన యుయ్‌ సుసాకికి షాక్‌ ఇచ్చి మంగళవారం ఇక్కడ జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో  ఫ్రీ స్టయిల్ 50 కేజీల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. అంతర్జాతీయ కెరీర్‌లో సుసాకికి ఇది మొట్టమొదటి ఓటమి, ఇది వినేశ్ సాధించిన విజయాన్ని మరింత ఘనతరం చేసింది.

మాజీ యూరోపియన్ ఛాంపియన్ ,  2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్… వినేశ్ ఫోగట్ తదుపరి ప్రత్యర్థి.

పెనాల్టీ పాయింట్లను అంగీకరించాక 0-2తో వెనుకబడిన భారత రెజ్లర్, చివరి ఐదు సెకన్లలో అద్భుతంగా రాణించి 3-2తో గెలిచి మూడు పాయింట్లు సాధించినప్పటికీ టాప్ సీడ్‌ను చేజార్చుకుంది.  ఉద్వేగభరితమయ్యాక వినేశ్ మూలకు దూసుకెళ్లి,  తన కోచ్ వోలర్ అకోస్‌ను కౌగిలించుకుని, విజయపు కేక వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News