Sunday, December 22, 2024

హర్యానా ఎన్నికల్లో వినేశ్‌ ఫొగాట్‌ విజయం

- Advertisement -
- Advertisement -

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ మహిళా రెజ్లర్, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగాట్‌ విజయం సాధించారు.  జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ప్రత్యర్థిపై దాదాపు 6వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆమె రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లా‌లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే, హర్యానాలో కాంగ్రెస్ మరోసారి ఓటమి దిశగా పయనిస్తోంది. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బిజెపి మ్యాజిక్ ఫిగర్ 46ను దాటేసింది. ప్రస్తుతం 50 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, కాంగ్రెస్ 35 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో హర్యానాలో బిజెపి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News