Monday, December 23, 2024

రష్యా బ్యాంకు నుంచి వినోద్ అదానీ 240మిలియన్ల డాలర్ల రుణం: ఫోర్బ్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఆర్థిక అక్రమాలపై హిండెన్‌బర్గ్ ఆరోపణలకు బలం చేకూరేలా ఫోర్బ్స్ ఓ కథనాన్ని వెలువరించింది. ‘ఇన్‌సైడ్ ది ఆఫ్‌షోర్ ఎంపైర్ హెల్మ్‌డ్ బై గౌతమ్ అదానీస్ ఓల్డర్ బ్రదర్’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. అదానీ సోదరుడు వినోద్ అదానీ సారథ్యంలో సింగపూర్‌కు చెందిన పినకల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (పిటిఇ) కంపెనీ 2020లో రష్యాకు చెందిన వీటీబీ బ్యాంకుతో రుణ ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఫోర్బ్ పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం బ్యాంకు నుంచి 240మిలియన్ల డాలర్ల రుణాన్ని పినకల్ కంపెనీ తీసుకున్నట్లు వెల్లడించింది. వినోద్ పరోక్షంగా నియంత్రించే పినాకిల్, ఆఫ్రో ఏషియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, వరల్డ్‌వైడ్ ఎమర్జింగ్ మార్కెట్ హోల్డింగ్ కంపెనీలను లోన్ గ్యారెంటర్లుగా అందించింది. రెండు ఫండ్‌లు కలిసి అదానీ స్టాక్స్‌లో 4బిలియన్ల డాలర్లను కలిగి ఉన్నాయి.

కాగా నిబంధనల ప్రకారం ప్రమోటర్లు తమ షేర్లను తాకట్టుపెడితే స్టాక్‌ఎక్సేంజ్‌లకు విధిగా తెలపాలి. అయితే రుణానికి సంబంధించిన విషయాన్ని గ్రూప్ వెల్లడించలేదని ఫోర్బ్ తెలిపింది. అక్రమ లావాదేవీలపై వినోద్ అదానీని స్పందనను కోరినా సమాధానమివ్వలేదని తెలిపింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందిస్తూ వినోద్ అదానీ కంపెనీ నిధులు, ఆర్థిక లావాదేవీలు తమకు తెలియదని సంగతి విదితమే. కానీ అదానీ గ్రూప్ అనుమతి లేకుండా కంపెనీ షేర్లను తాకట్టుపెట్టి రుణం తీసుకోవడం సాధ్యంకాదని ఫోర్బ్ పేర్కొంది. దుబాయ్‌లో ఉండే వినోద్ అదానీ నుంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తారు. దుబాయ్‌లో ఉండే వ్యాపారాలతోపాటు సింగపూర్, జకార్తాలో వ్యాపార వ్యవహారాలను నిర్వహిస్తారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం వినోద్ అదానీప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రవాస భారతీయుడిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News