Monday, December 23, 2024

మొన్న ఎగుమతులు.. నిన్న నిషేధం..

- Advertisement -
- Advertisement -

ఇదీ మోడీ సర్కార్ మాయాజాలం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపాటు

Boinapally Vinod Kumar fire on bandi sanjay

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిలకడలేని విధానాలు, చర్యలతో ప్రపంచ దేశాల ఎదుట భారత్ నవ్వులపాలు అయ్యే విధంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తానని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో నెల రోజుల క్రితం జరిగిన వర్చువల్ మీట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని, కాని నెల రోజుల్లోనే ప్రపంచ దేశాలకు భారతదేశం నుంచి గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వినోద్‌కుమార్ అన్నారు. దేశంలో రైతులు ఎంత పంట పండిస్తున్నారు..?, వ్యవసాయ ఉత్పత్తులు ఏ మేరకు వస్తున్నాయి..? వంటి అంశాలు ప్రధానికి, ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేకి అని, రైతుల పట్ల మోడీకి ఏ మాత్రం ప్రేమ, అభిమానం లేదని ఈ చర్యల ద్వారా స్పష్టం అయిందని అన్నారు.

వ్యవసాయం పట్ల మోడీ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని ఆయన విమర్శించారు. రైతులను అన్ని రకాలుగా దగా చేయడమే కేంద్రానిది ఏకైక అజెండా అని విమర్శించారు. దేశంలో ప్రతి ఏటా సుమారు 300 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులు ఉత్పత్తి అవుతుండగా, అందులో 50 శాతం దేశ ప్రజల అవసరాల కోసం, ఆహార భద్రత కోసం నిల్వలు ఉంచుకుని మిగతా ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాల్సిన కనీస బాధ్యత ప్రధానిపై ఉందని వినోద్‌కుమార్ అన్నారు. ప్రపంచంలో 100 చిన్న దేశాలు తమ దేశాల అవసరాల కోసం ఆహార ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసు కుంటున్నాయని అన్నారు.

గోధుమలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ అధికారుల బృందాన్ని మొరాకో, తునిసియ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా, లెబనాన్ వంటి దేశాలకు నిన్నగాక మొన్న పంపించారని, అంతలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గోధుమల ఎగుమతిపై నిషేధం విధించారని తెలిపారు. ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల వివరాలను ప్రధాని నరేంద్ర మోడీ తెప్పించుకుని రానున్న రోజుల్లో దేశం నుంచి ఫుడ్ గ్రైన్స్ ఎగుమతులు చేయాలని వినోద్‌కుమార్ సూచించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News