Wednesday, January 22, 2025

మాడభూషి శ్రీధర్‌కు వినోద్‌కుమార్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్, లా ప్రొఫెసర్, ఆర్‌టిఐ మాజీ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పరామర్శించారు. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, వారి కుటుంబ సభ్యులను వినోద్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మహేంద్ర యూనివర్శిటీ లా విభాగం హెడ్ గా మాడభూషి శ్రీధర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు నల్సార్ జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం లా ప్రొఫెసర్ గా, ఆ తర్వాత బెన్నెట్ లా యూనివ్సిటీలో డీన్ గా బాధ్యతలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శ్రీధర్‌ను కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News