Sunday, January 19, 2025

వినోద్ కుమార్ గళం… కరీంనగర్‌కు బలం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వినోద్ కుమార్ గళం కరీంనగర్‌కు బలమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కెటిఆర్ తన ట్వీటర్ లో ట్వీట్ చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికవడంతో పాటు రైల్వే లైన్ రావడంతో కీలక పాత్ర పోషించారని, విద్యుత్, సాగునీరు, హైకోర్టు, 95 శాతం స్థానిక రిజర్వేషన్లు వివిధ అంశాలపై పార్లమెంటు, ఢిల్లీలో వినోద్ కుమార్ అలుపెరగని పోరాటం చేశారని ప్రశంసించారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్కార్సైన ఉద్యమకారుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వినోద్ కుమార్ అని కెటిఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని, ట్రిపుల్ ఐటి వంటి సంస్థలు కరీంనగర్‌కు రావాలంటే లోక్ సభలో వినోద్ కుమార్ గొంతు వినిపించాలని, కరీంనగర్ అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం బిఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో కెసిఆర్ నాయకత్వంలో ఏర్పాటైన టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు అని, 2004లో ఎంపిగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ కీలక పాత్ర పోషించారని కెటిఆర్ కొనియాడారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News