Thursday, January 23, 2025

కారులో ప్రముఖ మలయాళీ నటుడి శవం

- Advertisement -
- Advertisement -

కేరళలోని కొట్టాయం పంపాడి సమీపంలో ఓ హోటల్ లో పార్క్ చేసి ఉన్న ఓ కారులోంచి పొగలు వస్తున్నాయి. అది చూసిన హోటల్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి కారు తెరిచి చూస్తే, అందులో ఓ శవం. ఆ శవం ఓ మలయాళ నటుడిది. ఆ శవం… వినోద్ థామస్ అనే ఓ నటుడిది. ఈ వార్త కేరళ అంతా దావానలంలా వ్యాపించింది. ఇటీవల వరుస సినిమాల్లో నటిస్తూ, చక్కటి పేరు తెచ్చుకుంటున్న థామస్, ఇంతలోనే ఇలా మృత్యువాత పడటంతో అభిమానులు కంటనీరు పెడుతున్నారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. కారులోని ఎయిర్ కండిషనర్ లోంచి విషవాయువులు వెలువడటం వల్లనే థామస్ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్  (తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లా నాయక్ పేరిట రీమేక్ అయింది), ఒరు మురై వంత్ పథాయ, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో థామస్ నటనకు ప్రశంసలు లభించాయి. ఆయన ప్రస్తుతం ఈ వాలయం అనే సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News