- Advertisement -
హైదరాబాద్ : శ్రీశైలంలోని జెన్‌కో అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ హైడ్రో పవర్ స్టేషన్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించారు. శనివారం జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆయన పరిశీలించారు. హైడ్రో పవర్ స్టేషన్ పనితీరు గురించి వినోద్ కుమార్‌కు శ్రీశైలం పవర్ హౌస్ చీఫ్ ఇంజనీర్ రామసుబ్బారెడ్డి వివరించారు. కొంత కాలం కిందట జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటన తరువాత శ్రీశైలం పవర్ హౌస్ లోని మొత్తం ఆరు యూనిట్లలోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని, త్వరలోనే ఆరవ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చీఫ్ ఇంజనీర్ వివరించారు. పవర్‌స్టేషన్ పనితీరు పట్ల వినోద్‌కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
- Advertisement -