Monday, December 23, 2024

బైండోవర్ నియమాలు ఉల్లంఘన.. నలుగురికి జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పర్వతగిరి: వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పర్వతగిరి మండలానికి చెందిన దొనికెన కిష్టమ్మ, నిమ్మ అనసూయ, చీనూరి రజిత, ముంజల పద్మలు గతంలో గుడుంబా నేరానికి పాల్పడి తహసీల్దారు ముందు బైండోవర్ అయ్యారు. కాగా వారి ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ గుడుంబా అమ్మకం నేరానికి పాల్పడి బైండోవర్ నియమాలను ఉల్లంఘించినందున పర్వతగిరి తహసీల్దారు కోమి ఆదేశాల మేరకు ఈ నలుగురిని ఖమ్మం సెంట్రల్ జైలుకు తరలించామని తెలిపారు. స్టేషన్ పరిధిలో బైండోవర్ అయిన వారు నియమాలను ఉల్లంఘిస్తే రూ. రెండు లక్షల జరిమానా, జైలు శిక్ష తప్పదని ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News