Monday, December 23, 2024

పెగాసస్ స్పైవేర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం: బుగ్గన

- Advertisement -
- Advertisement -

AP Minister Buggana Speech State Budget 2020
అమరావతి: పెగాసస్ వంటి స్పైవేర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది ప్రమాదమే కాదు.. ఇది అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొన్నారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారన్నారు. ఈ స్పైవేర్‌తో వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉందని, ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్‌గానే చేస్తారన్నారు. చంద్రబాబు చేసిన చర్య మానవహక్కులకు భంగం కలిగించడమేనని బుగ్గన విరుచుకపడ్డారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనడం ఘోరమైన నేరమన్నారు. చంద్రబాబుకు అడ్డదారి రాజకీయాలు మాత్రమే తెలుసునన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News