Thursday, January 23, 2025

సివిల్‌కోడ్‌పై న్యాయపోరు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) మత స్వేచ్ఛకు భంగకరం అని, దీనిని తాము న్యాయపరంగానే ఎదుర్కొంటామని జమాయిత్ ఉలేమా ఏ హింద్ హెచ్చరించింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క వర్గానికి మత స్వేచ్ఛ కల్పించారు. దీనికి భంగకరంగా జరిగే ఎటువంటి చర్యను అయినా తాము ప్రతిఘటిస్తామని ఈ ముస్లిం సంస్థ సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. తాము తమ నిరసనలను తెలిపేందుకు వీధుల్లోకి వెళ్లేది లేదని, ఆందోళనకు దిగేది లేదని, కేవలం న్యాయం చట్టం పరిధిలో తమ పోరు సాగుతుందని,

దేనికోసం అయినా కోర్టును ఆశ్రయించడం జరుగుతుందని ఈ ప్రకటనలో తెలిపారు. దేశంలో యుసిసి కోసం ఇటీవలే లా కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ ఉమ్మడి పౌరస్మృతిపై తమతమ అభిప్రాయాలను తెలియచేయాలని సంబంధిత పక్షాలకు లా కమిషన్ వర్తమానం పంపించింది. ఉమ్మడి పౌరస్మృతి విషయం దేశంలో రాజకీయ సున్నితమైన అంశం అయింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దీనిపై కసరత్తులు వేగవంతం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News