Sunday, September 8, 2024

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

Violators of COVID-19 norms to be sent to jail

డెహ్రాడూన్ : కరోనా వైరస్ నివారణకు సూచించిన నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్సును అమలులోకి తెచ్చింది. ఉత్తరాఖండ్ ఎపిడెమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్సుకు గవర్నర్ బేబీ రాణి మౌర్య తన ఆమోదాన్ని శనివారం తెలియచేశారు. దీంతో గెజిట్‌లో దీన్ని నోటిఫై చేశారు. ఈ ఆర్డినెన్సు ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష కానీ రూ.5000 జరిమానా కానీ లేదా రెండూ కలిపి కానీ విధిస్తారు. మాస్క్ ధరించక పోయినా, సామాజిక దూరం పాటించక పోయినా , క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినా అరెస్టు చేస్తారు.

Violators of COVID-19 norms to be sent to jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News