Monday, December 23, 2024

మైనర్ బాలికపై అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై మరో మైనర్ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులోని (వరంగల్- రాజమండ్రి) బైపాస్‌లో సమీపంలోని వెంపటి నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలో కొన్ని బుడగ జంగాల కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. నాలుగు నెలల కిత్రం శాంత అనే మహిళ జనగం జిల్లా స్టేషన ఘన్పూర్ నుంచి ఇక్కడికి వచ్చి రోజువారి జాతకాలు చెప్పుకుంటూ నివాసం ఉంటుంది. తనకు మగ పిల్లలు లేకపోవడంతో తన ఆడబిడ్డ కుమారుడు మేనల్లుడిని పెంచుకుంటుంది.

లైంగికదాడికి గురైన బాలిక కుటుంబం వారం రోజుల క్రితం తొర్రూర్ నుంచి ఇక్కడికి వచ్చి గుడిసే వేసుకుని నివాసం ఉంటున్నారు. అందరు జాతకాలు చెప్పడానికి వెళ్లిపోగా… బాలిక ఇంటి వద్ద పిల్లలతో ఆడుకుంటుంది. గమనించిన కిరణ్ బిస్కెట్ ప్యాకేట్ ఆశ చూపి ఎత్తుకే హాల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఇంటివద్ద దించి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న తండ్రికి బాలిక తనకు నొప్పి వస్తుందని రోధిస్తుండటంతో అనుమానం వచ్చి పరిశీలించగా జరిగిన విషయాన్ని చెప్పింది. నిందితుడిని గురించి ఆరా తీయగా మైనర్ బాబుని చూపించంతో కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించాడు.

ఇదిలా ఉండగా బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ క్రమంలో ఎవరూ పట్టించుకోలేదని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News