Sunday, December 22, 2024

మణిపుర్ ఎన్నికల్లో హింసాకాండ

- Advertisement -
- Advertisement -

2024 లోక్ సభ మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలయ్యాయి. 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో మొదటి దశ ఎన్నికలు మొదలయ్యాయి. ఈ మొదటి దశ ఎన్నికల్లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు- నితిన్ గడ్కరి, కిరేణ్ రిజిజు, శరబానంద సోనోవాల్, జితేంద్ర సింగ్, భూపేంద్ర యాదవ్ పోటీపడుతున్నారు. వీరేకాక కాంగ్రెస్ కు చెందిన గౌరవ్ గొగోయ్, డిఎంకెకు చెందిన కనిమొళి, తమిళనాడు బిజెపి చీఫ్ అన్నామళ్లై కూడా బరిలో ఉన్నారు.

తొలి దశ పోలింగ్ లో తమిళనాడు నుంచి 39 సీట్లు, పుదుచ్చేరి నుంచి ఒక సీటుకు కలుపుకుని దక్షిణాదిన తొలి దశలో అధిక సంఖ్య సీట్లకు పోటీ జరుగుతున్నది. ప్రధాని మోడీ అనేక పర్యాయాలు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో బిజెపి తన కాలు మోపాలని బలంగా కోరుకుంటోంది. అయితే ప్రధాన పార్టీలు డిఎంకె, ఏఐఏడిఎంకె అనే చెప్పాలి.

ఇదిలావుండగా మణిపుర్ లోని మొయిరాంగ్ అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన తమన్పోక్పి పోలింగ్ స్టేషన్ లో కొందరు తుంటరులు కాల్పులు జరిపారు. కాగా కూచ్ బీహార్ లో టిఎంసి, బిజెపి కార్యకర్తలు ఘర్షణపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News