Monday, December 23, 2024

మరాఠా కోటా ఉద్యమంలో హింస… శెలవుపై జల్నా జిల్లా ఎస్‌పి

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర లోని జల్నా జిల్లాలో జరుగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో జల్నా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుషార్ దోషిని విధుల నుంచి తప్పనిసరి శెలవుపై ప్రభుత్వం పంపించింది. ఈ ఉద్యమం శుక్రవారం తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారడంతో పోలీస్‌లు లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న 40 మందిని పోలీస్‌లు అరెస్టు చేశారు. మరాఠా కోటాపై నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చడానికి అధికారులు ప్రయత్నించగా, ఆందోళన కారులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా అంతర్వలి సారథి గ్రామంలో ఆందోళన కారులను చెదరగొట్టడానికి పోలీస్‌లు లాఠీ ఛార్జి చేశారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా 40 మంది పోలీస్‌లతో సహా పలువురు గాయపడ్డారు. 15 రాష్ట్ర రవాణా బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారు. హింసకు సంబంధించి 360 మందిని పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. రాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేయడంతోపాటు చాలా మంది విపక్ష నాయకులు పోలీస్ చర్యను తీవ్రంగా విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News