మణిపూర్ లో మళ్లీ హింసాకాండ చెలరేగడంతో కుకి ప్రాబాల్యం ఉన్న ప్రాంతాలలో జనజీవనం స్తంభించింది. సైనిక దళాల అణచివేత చర్యలకు నిరసనగా కుకీ, జో గ్రూప్ లు నిరవధిక బంద్ కు పిలుపునివ్వడంతో ముఖ్యంగా కాంగ్ పోక్బి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శనివారం కుకి నిరసనకారులకు, భద్రతాదళాలకు మధ్యజరిగిన ఘర్షణలో ఒకవ్యక్తి చనిపోయాడు, 40మంది గాయపడడంతో కుకీ,జో గ్రూప్ లు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నాయి. చురచందాపూర్, టెంగ్నోపాల్ జిల్లాల్లోని కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో నిరసనకారులు రోడ్లపై టైర్లు తగులపెట్టి, భారీ దుంగలను వేసి రాకపోకలను అడ్డుకుంటున్నారు. ఆ రోడ్ల పై అడ్డంకులు తొలగించేందుకు సైన్యం కష్టపడుతోంది. ఇయితే కొత్తగా ఎలాంటి హింసాకాండ జరగలేదు.
ఇంఫాల్ – ధిమాపూర్ మధ్య సాగే నేషనల్ హైవే 2 పైనా,
గంఘిపై లోనూ వద్ద అదనపు బలగాలను దించి పహరాను ముమ్మరం చేశారు. కేంద్ర హోం మంత్రి అమితషా ఆదేశంతో జనం రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించడంతో ఆ ఆదేశానికి నిరసనగా ఆందోళన చేపట్టిన కుకీ లపై పోలీసులు బాష్పవాయువు ప్రోయగించడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో ఒకరు చనిపోగా, మరో మహిళ, పోలీసుతో సహా 40 మంది గాయపడ్డారు. భద్రతా దళాలకు చెందిన ఐదు వాహనాలు దగ్ధమయ్యాయి. అదనపు బలగాల రాకతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. కుకీ- జో గ్రూప్ లకు చెందిన స్థానిక గిరిజన నాయకుల ఫోరం నిరవధిక బంద్ ప్రతిపాదను పూర్తిగా సమర్థించింది. మైతీ లు చేపట్టిన శాంతి యాత్రను అడ్డుకుంటామని కుకీలు ప్రకటించగా, తగిన పర్మిషన్ లేదంటూ, పోలీసులు కాంగ్ పోక్పి వైపు శాంతి యాత్ర వెళ్లకుండా సెక్మై వద్దనే నిలిపివేశారు.