Friday, December 27, 2024

మణిపూర్‌లో ఆగని హింస..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : హింసాత్మక ఘర్షణలతో రగులుతున్న మణిపూర్‌లో కొందరు నిరసన కారులు గురువారం మధ్యాహ్నం రెండు ఇళ్లను తగులబెట్టారు. ఖమెన్‌లక్ ప్రాంతంలో ఓ కుకీ గ్రామంపై కొందరు జరిపిన దాడిలో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన తరువాత తాజాగా గురువారం మళ్లీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. న్యూచెకాన్ ప్రాంతంలో ఆందోళన కారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది భాష్పవాయువును ప్రయోగించారు. కాలిపోతున్న ఇళ్లలో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ, అస్సాంరైఫిల్స్ తమ గస్తీని ముమ్మరం చేసి అడ్డంకులు నివారిస్తున్నారు.

ఆయా ప్రాంతాలను అదుపు లోకి తీసుకోడానికి “ప్రాంతీయ ఆధిపత్య ” ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కుకీ గ్రామంపై దాడులకు తొమ్మిది మంది మరణించిన తరువాత ఆ ప్రాంతంలో భద్రతా దళాలు తమ భద్రతను రెట్టింపు చేశారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లా లోని లాంఫెల్ ప్రాంతంలో రాష్ట్ర మహిళా మంత్రి నెమ్నా కిప్జెన్ అధికారిక నివాసానికి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బుధవారం రాత్రి నిప్పు పెట్టారు. మంత్రి నివాసంలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News