- Advertisement -
న్యూఢిల్లీ: మయన్మార్ లోహింసాత్మక సంఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో మయన్మార్ నుంచి చిన్ కుకీ తెగకు చెందిన వారు పెద్ద ఎత్తున దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వాళ్లను అడ్డుకునేందుకు అస్సాం రైఫిల్స్ అప్రమత్తం అయింది.
స్థానికేతరులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని స్థానికులను అధికారులు కోరుతున్నారు. మయన్మార్ సరిహద్దులోని ఛాంపాయ్ జిల్లా జోఖత్వార్ గ్రామానికి ఇటీవల 100 కుటుంబాలు వచ్చినట్టు సమాచారం. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈ గ్రామంలో ఆశ్రయం పొందుతున్న శరణార్థుల కుటుంబాల సంఖ్య 6000 కు పైగా ఉంది.
- Advertisement -