Monday, January 20, 2025

నైగర్‌లో తిరుగుబాటు అల్లర్లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆఫ్రికా దేశం నైగర్‌లో హింసాకాండ పెరుగుతోంది. తిరుగుబాటుతో దేశమంతా సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు అక్కడ ఉండడం మంచిది కాదని, వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. ఇదే విధంగా ఇప్పటికే పలు ఐరోపాదేశాలు తమ దేశీయులకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతానికి విమానాలు పంపి తీసుకొచ్చేందుకు వీలు లేకుండా ఉందని పేర్కొంది.

సరిహద్దులు దాటుకుని వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. నైగర్‌కు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలు వాయిదా వేసుకుని కొన్నిరోజులు ఆగితే మంచిదని సలహా ఇచ్చింది. నైగర్‌లో దాదాపు 250 మంది భారతీయులున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి వాళ్లంతా క్షేమం గానే ఉన్నారు. అక్కడ నుంచి భారతీయులను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News