Wednesday, January 22, 2025

విప్లవమా! శుభోదయం

- Advertisement -
- Advertisement -

(లాంగ్టన్ హ్యుస్ గుడ్ మార్నింగ్ రివల్యూషన్ కవితకు తెలుగు అనువాదం)


విప్లవమా!అన్నింటికంటే అత్యంత చేరువైన నా మిత్రమా శుభోదయం
మనం ఇక నుంచీచెట్టా పట్టాలు వేసుకుతిరుగుతాం విను మిత్రమా
నేను ఎక్కడ పనిచేసేవాడినో, నా యజమాని ఎవరో నీకు బాగా తెలుసు, ఖర్చులు తగ్గించడానికి ఎవరి నయినా పీకేస్తాడు వాడు మీ గురించి పత్రికలకు ఒక సుదీర్ఘ లేఖ రాశాడు. మీరంటేనేఒక ఉత్పాతం, ఒక గ్రహాంతర శత్రువు అని చెప్పాడు, మరోమాటలో చెప్పాలంటే మీరోకలం. కొడుకట అతను పోలీసులకు ఫోన్ చేశాడు ఒక వ్యక్తి మీద కన్నువేసి ఉంచమనివారికి చెప్పాడు/ ఆ వ్యక్తి పేరు విప్లవంఅన్నాడు / మీరు నా నేస్తమని వాడికి తెలుసు.
మనం కలసితిరగడం అతను చూశాడు/ మేము ఆకలితో కృశించివున్నామనిఅతనికి తెలుసు,/ ఈ ప్రపంచంలో మా కంటూ ఏది మిగిలి లేదని వాడికి తెలుసు. / దాని గురించి మనం ఏదో ఒకటి చేయబోతున్నామనీ తెలుసు.
ఈ యజమాని తనకు కావలసినవన్నీఖచ్చితంగా పొందాడు. కడుపుబ్బేలాతినుబండారాలు, విశాలమైన లోగిళ్లు వినోద యాత్రలకు సెలవులు… అన్నీ అనుభవిస్తాడు వాడు నిరసనలని కూల్చివేస్తాడు/ రాజకీయాలు నడుపుతాడు, పోలీసులకు లంచాలు ఇస్తాడు / శాసన సభలను కొనేసుకుంటాడు/ భూగోళమంతా రాజసంగా తిరుగుతుంటాడు /కానీ నాకు,
ఎప్పుడూ కడుపునిండా కూడు లేదు./ శీతాకాలంలో కనీసం వెచ్చగా ఉండే గూడు లేదు .
నాకు జీవితంలో భద్రతంటే తెలియదు –
నా జీవితమంతా, చాలీ చాలని తండ్లాట
చాలీ చాలని పెనుగులాట..
విప్లవమా విను/ చూడు, మనం స్నేహితులం
కలసిఏదైనా సాధించుకోగలం.
కర్మాగారాలు, ఆయుధాగారాలు, ఇళ్ళు, ఓడలు, రైలుమార్గాలు, అడవులు, పొలాలు, తోటలు, బస్సు రోడ్లు , టెలిగ్రాఫ్ లు, రేడియోలు, (దేవుడా! రేడియోలతో నరకాన్ని పెంచండి!) ఉక్కు ఫాక్టరీలు,బొగ్గు గనులు, చమురు బావులు, గ్యాస్, అన్ని ఉత్పత్తి సాధనాలు,ప్రతిదీమన స్వాధీనం
( ఆ రోజు ఎంత గొప్ప ఉషోదయం )
ప్రతిదీ శ్రామికుల పరం చేద్దాం / వారి కోసం పాలించుదాం కార్మిక కల్యాణానికై శ్రమించుదాం.
అబ్బాయి! ఆ రేడియో వినండి !
ఆశుభకామనలతొలిప్రభాతం సోవియట్ రష్యా ప్రసారం/ సోవియట్ అంతర్జాతీయ శిబిరంలో మరొ సభ్యదేశం చేరింది.
సోషలిస్టు సోవియట్ రిపబ్లిక్ లకు శుభాకాంక్షలు/ హేయ్, ప్రతిచోటాశ్రామిక శ్రేయోరాజ్య ప్రకంపనలు.
ప్రతిచోటావువ్వెత్తునలేస్తున్నకార్మికులపలకరింపులు/ అందరికీ విప్లవాభినందనలు/ అది మా సంతకం, ఇక అన్నీ చోట్లా మా సంతకమే / సంతకాలు చేయండి, చరిత్రలో మన సంతకాలు నింపండి / జర్మనీ, చైనా, ఆఫ్రికా, ఇటలీ,అమెరికా / అంతటా ఒకే ఒక్క పేరుతో సంతకం చేయండి: శ్రామికుడు/ మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా / ఎవడూ ఆకలితో అలమటించడు, ఎక్కడా అణచివేత ఉండదు/ అది మన పని! అదీ మన పని / నేను చాలా కాలంగా అలమటిస్తూ ఉన్నాను, మరి మీరు?
పదండి… ముందుకు తోసుకుపోదాం
లెట్స్ గో, రివల్యూషన్ !

డాక్టర్. యస్. జతిన్ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News