Wednesday, January 22, 2025

డ్రగ్స్ పెడ్లర్ జాబితాలో విఐపిలు

- Advertisement -
- Advertisement -

ఇటీవల స్టాన్లీని అరెస్టు చేసిన పోలీసులు
తమ పేర్లు బయటికి వస్తయని ఆందోళన చెందుతున్న ప్రముఖులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ కేసులో సంచలన విషయాలు బయపడుతున్నట్లు తెలిసింది. నైజీరియాకు చెందిన ఉడొకో స్టాన్లీ ఇండియాకు వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. స్టాన్లీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మరో డ్రగ్స్ పెడ్లర్ ఓక్రా వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ఓక్రాను గోవా పోలీసులు అరెస్టు చేయడంతో మూడేళ్ల నుంచి జైలులో ఉంటున్నాడు.

ఓక్లా సాయంతో స్టాన్లీ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌లోని పలువురు విఐపిలకు స్టాన్లీ గత కొంత కాలం నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాట్లు తెలిసింది. స్టాన్లీ కోసం హైదరాబాద్‌లో ఎవరెవరు పనిచేస్తున్న విషయంపై ఆరా తీస్తున్నారు. స్టాన్లీ కాంటాక్ట్ లిస్టులో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలిసింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనునట్లు తెలిసింది.

దీంతో స్టాన్లీ వద్ద డ్రగ్‌స కొనుగోలు చేసిన వారు తమ పేర్తు బయటపడతాయని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. 2009లో ఇండియాకు వచ్చిన స్టాన్లీ ముంబైలో జూవెల్ అనే వ్యక్తి సాయంతో రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. అక్కడి నుంచి గోవాలోని కండోలిమ్‌కు చేరుకున్నాడు. నైజీరియన్లతో పరిచయం పెంచుకున్ని వారు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారం గురించి తెలుసుకున్నాడు. తర్వాత డ్రగ్స్ నైజీరియన్ల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ డబ్బులకు దేశంలోని వివిధ ప్రాంతాల వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. గత 15 ఏళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News