Sunday, December 22, 2024

‘బేబీ’ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ..

- Advertisement -
- Advertisement -

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు హీరోహీరోయిన్లుగా సాయి రాజే ష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఈనెల 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నా పాత్ర పేరు విరాజ్. తొలిసారి నా రియల్ నేమ్ క్యారెక్టర్ చేస్తుండటం సంతోషం గా ఉంది.

ఈ సినిమాలో ఆనంద్, వైష్ణవి, నా పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. నేను కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. జీవితం గురించి ఏమీ తెలియని ఓ కుర్రాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటాడు. బేబీ సినిమాలో డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి.  ఆనంద్, వైష్ణవి క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయి నా రెగ్యులర్‌గా, రొటీన్‌గా ఉండదు”అని అన్నారు.

Also Read: బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడి ‘జిలేబి’ వచ్చేస్తోంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News