Monday, December 23, 2024

విరాజిల్లిన “విరాజి”

- Advertisement -
- Advertisement -

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల ఎమ్3 మీడియా పతాకం పై మహా మూవీస్ తో కలిసి నిర్మించిన చిత్రం ‘విరాజి’. భారీ పోటీ నడుమ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ

ఓ పిచ్చాసుపత్రి నేపథ్యంలో ఓ పది మంది వ్యక్తులు వివిధ కారణాలతో అక్కడికి వచ్చి, అక్కడినుంచి బయటకు వెళ్ళలేక, ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతుంటారు. ‘ఈవెంట్’ పేరుతో తమను మూసివేయ బడ్డ ఆ  పిచ్చాసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఆ టైంలో వరుణ్ సందేశ్ కూడా మిగతా వారి లాగే ఆ పిచ్చాసుపత్రి లోకి వస్తాడు. వరుణ్ సందేశ్ వచ్చిన తర్వాత ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?.. అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఎవరు? చివరకు ఆ ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి ఎవరైనా బయటపడ్డారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సొసైటీలో ఇప్పుడున్న ఒక్క సమస్యను తీసుకొని, దానికి థ్రిల్లర్ సస్పెన్స్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా చివరి వరకు ట్విస్టులేవి రివీల్ చేయకుండా కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించాడు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.

ఇంటర్వెల్ వరకు  సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ సీను అదిరిపోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే  హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది.

నటీనటులు:

ఆండీ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు.

సిఐ మురళీగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:

ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు.

రేటింగ్: 3.5/5

Viraji 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News