Friday, November 22, 2024

వణికిస్తున్న వైరల్ ఫీవర్లు

- Advertisement -
- Advertisement -

Viral Fever cases Rise In Hyderabad City

ఆసుపత్రుల బాటపట్టిన నగర వాసులు
వాతావరణ మార్పుతో దగ్గు, జలుబు, జ్వరం వ్యాధులతో ఇబ్బందులు
కలుషిత నీటితో విరేచనాలు, పుడ్‌పాయిజనింగ్ సమస్యలంటున్న వైద్యులు
బస్తీదవఖానలు, పీహెచ్‌సీలకు పెరుగుతున్న రోగుల సంఖ్య
వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని డా. అనీష్ ఆనంద్ సూచనలు

 

హైదరాబాద్: నగరంలో ఇటీవల కురుస్తున్న వానలకు వాతావరణ మార్పు కావడంతో ప్రజలు వివిధ రకాల వ్యాధులు బారినపడుతున్నారు. మొన్నటివరకు కరోనా సెకండ్‌వేవ్‌తో తల్లిడిల్లిన సామాన్య ప్రజలు భారీ వర్షాలకు దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు, తలనొప్పి, కాళ్ల పగులు వంటి సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు నిల్వ ఉండటంతో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా విజృంభణ చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులకు వెన్ను నొప్పి, కీళ్ల నొప్పిలు, రక్తంలో తక్కువ ప్లేట్‌లెట్ల సమస్య వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. వర్షపు నీరు బురదతో కలవడంతో తాగేనీరు కలుషితం కారణంగా విరేచనాలు, వాంతులు వంటి వస్తాయని, అపరిశుభ్రతమైన పరిస్దితి నెలకొనడంతో రోగులు ఎక్కువగా విరేచనాలు, పుడ్ పాయిజనింగ్ బాధపడుతారని చెబుతున్నారు. ఉష్ణోగ్రత తగ్గిన కారణంగా జలుబు, దగ్గుతో పాటు ప్లూ, న్యుమోనియి, ఇన్‌ప్లూయెంజా ప్రజలను ఇబ్బందులు పెడుతుందంటున్నారు.

అలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న రోగుల్లో వాతావరణంలో ఎక్కువ తేమ చేరిన కారణంగా వారిలో అస్తమా, బ్రోంకైటీస్‌లు వస్తాయని, వారిలో ఆకస్మికంగా శ్వాస, ఉబ్బసం సమస్యలు సంభవిస్తాయని వివరిస్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులతో పాటు బస్తీదవఖానలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు రోగులు బారులు కట్టినట్లు రోజుకు 60 నుంచి 80మంది వరకు రోగులకు చికిత్సలు అందిస్తున్నట్లు పీహెచ్‌సీ వైద్యులు పేర్కొంటున్నారు. విషజ్వరాలకు పేరుగాంచిన ఫీవర్ ఆసుపత్రి రోగులతో బారులు తీరింది. సర్కార్ ఆసుపత్రుల్లో జనం రద్దీగా ఉండటంతో కొందరు ప్రైవేటుకు వెళ్లితే ముందుగా కరోనా టెస్టులు చేసి ఫీజులు దోపిడీకి తెర లేపారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటితో పాటు చుట్టుపక్కల వరద నీరు నిల్వకుండా చూడాలని, దోమతెరలు, మస్కిటో రిపెల్లంట్‌లను ఉపయోగించడం వలన డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి సమస్యలను నివారించవచ్చంటున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో యాంటీ మస్కిటో స్ప్రేలను చేయించాలని సూచిస్తున్నారు. వర్షంలో తడవకుండా, చేతులను శుభ్రంగా కడుకోవడం, ముఖ్యంగా వృద్దులకు ప్లూ టీకాలు వేయించాలని, ప్లూ, జలుబు బారిన పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు. డయేరియా పట్ల నిర్లక్షం చేయరాదని, శుభ్రమైన నీరు తాగడం, వెచ్చని ఆహారాన్ని తీసుకోవడం, వడపోసిన నీరు తాగడం మంచిదని, తరుచుగా చేతులు కడుకోవడం కూడా మంచి ఆరోగ్యానికి సహాయపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

వృద్దుల పట్ల జాగ్రత్తలు పాటించాలి:డా. జె. అనీష్ ఆనంద్

వృద్దులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకుని కార్డియాలజిస్ట్‌లను సంప్రదించాలని, బిగుసుకపోయి, బాధకరమైన కీళ్ల సమస్య ఉంటే క్రమం తప్పకుండా ఫిజియోథెరఫీ వ్యాయామాలు చేయాలి. నేల తడిసి జారుడుగా ఉన్నట్లుయితే వృద్దులు పడిపోయి గాయపడే ప్రమాద ఉన్నదని, వారు అదనపు జాగ్రత్తలు పాటించాలని అపోలో ఆసుపత్రి వైద్యులు డా. జె. అనీష్ ఆనంద్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News