Saturday, January 4, 2025

చలి తీవ్రతో వైరల్ ఫీవర్ల విజృంభణ….

- Advertisement -
- Advertisement -

దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో జనం అవస్థలు
ఐదారు రోజుల నుండి ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్న జనం
రోగులతో కిక్కిరిసిపోతున్న పీహెచ్‌సీలు, బస్తీదవఖానలు
ప్రజలు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యశాఖ

మన తెలంగాణ: నగరంలో చలి తీవ్రతతో శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు, అతిసార, ప్లూ జ్వరాలు విజృంభణ చేస్తున్నాయి. గత ఐదారు రోజుల నుంచి ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకే వచ్చే రోగుల్లో 10మందిలో ఆరు మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలు రోగులతో కిక్కిరిసిపోతున్నట్లు, చిన్నారులు ఎక్కువ వస్తున్నట్లు, స్కూళ్లలో విద్యార్థుల హాజరుశాతం తగ్గినట్లు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీవర్ ఆసుపత్రికి రోజుకు 350మందికిపైగా, పీహెచ్‌సీలు, బస్తీదవాఖానలకు 100 మంది వరకు ప్రజలు చికిత్స కోసం వస్తున్నారు. డిసెంబర్ నెలలో 1250 మందివరకు జ్వరాల బాధితులు వైద్యం వచ్చినట్లు వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా వాంతులు, విరేచనాలు, జలుబు,ముక్కు కారడం, జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, కాళ్లు లాగడం వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు.

Cold wave

వీటి నుంచి కోలుకోవడానికి వారం నుంచి పదిరోజుల సమయం పడుతుందని, వీటిలో దగ్గు రోగులను ఇబ్బందిపెడుతున్నట్లు, వైరల్ ఇన్పెక్షన్లు చాలా సమస్యాత్మకంగా మారుతున్నట్లు, శ్వాసకోశ, గుండెపైన ప్రభావం పడుతుందన్నారు. నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్లు నుంచి బయటపడవచ్చని, పిల్లలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఎక్కువగా జన సమూహం ఉన్న చోటుకు వెళ్లవద్దని, చల్లని ప్రాంతాల్లో తిరగవద్దని సూచిస్తున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సివస్తే ముఖానికి మాస్కులు తప్పకకుండా ధరించాలి, ఇంటికి వచ్చిన వెంటనే వేడి నీటిని తాగాలి.

Corona to resemble common cold by coming year

పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తంగా ఉండాలని, దగ్గుతో కూడిన ఆయాసం వస్తే వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు. ఈ వైరల్ ఫీవర్లు ఫిబ్రవరి వరకు ఉనికి చాటే అవకాశముందని, చలికి ఎక్కువగా తిరగకుండా చూసుకోవాలని వెల్లడిస్తున్నారు. నగర ప్రజలు వైద్య చికిత్స విషయంలో కొంత ఆలస్యమైన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దే చికిత్సలు తీసుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లితే 12 రకాల వైద్య పరీక్షల పేరుతో నిలువునా దోచుకుంటారని, సర్కార్ దవాఖానలో నాణ్యమైన వైద్యం అందిస్తామని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

Cold intensity Rising across Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News