Friday, November 22, 2024

గ్రేటర్‌లో పెరుగుతున్న విష జ్వరాలు

- Advertisement -
- Advertisement -

Viral fevers growing in Greater Hyderabad

జలుబు,దగ్గు, జ్వరంతో ఆసుపత్రులకు పరుగులు
రెండో రోజులుగా చల్లబడ వాతావరణం
రోగులతో రద్దీగా మారిన బస్తీదవఖానలు
వచ్చే రెండు నెల పాటు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

హైదరాబాద్: నగరంలో రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో చలిగాలలు వస్తుండటంతో ప్రజలు విష జ్వరాల బారినపడుతూ చికిత్స కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో మూలుగుతూ మంచం పడుతున్నారు. దీంతో పేదలకు వైద్యానికి పేరుగాంచిన ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులో పాటు బస్తీ దవఖానలకు జనం క్యూ కడుతున్నారు. మొన్నటి వరకు మలేరియా, డెంగ్యూ వ్యాధులతో ఇబ్బందులు పడ్డ జనం ప్రస్తుతం చలి జ్వరం, జలుబుతో పలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలువురు రోగులు పేర్కొంటున్నారు. విషజ్వరాలకు వైద్యం అందించే ఫీవర్ ఆసుపత్రికి రోజుకు 200మందికి పైగా రోగులు వస్తున్నట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు కూడా విషజ్వరాల బాధితులు సంఖ్య భారీగా ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

వచ్చేది చలికాలంలో కావడంతో ఇంకా విష జ్వరాలు విజృంబించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యనిపుణులు వివరిస్తున్నారు. మరోపక్క నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లు పేరుకపోవడంతో దోమలు విస్తరించి రాత్రింబళ్లు తేడా లేకుంటా కాటు వేయడంతో చాలామంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాదులకు గురైతూ చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు బాట పడుతున్నారు. దీంతో బస్తీ దవఖానల సిబ్బంది ముందుగా టెస్టులు నిర్వహించి వ్యాధులను నిర్దారించి కావాల్సిన చికిత్స అందిస్తున్నారు. నగరంలో 226 బస్తీదవఖానలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు, నాలుగు రోజుల నుంచి వైద్యంకోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగిందంటున్నారు. దీని దృష్టిలో పెట్టుకుని సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. వచ్చే రెండు నెల పాటు పండగలు ఉండటంతో కరోనా ఉనికిచాటే అవకాశముందని, వేడుకలను పరిమిత సంఖ్యలో చేయాలని, ఒకే దగ్గర గుంపులుగా ఉండి విందులు చేస్తే మహమ్మారి పంజా విసురుతుందని, ఇప్పటికి రోజు 55 నుంచి 60వరకు పాజిటివ్ కేసులు నమోదైతున్నట్లు, ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News