Friday, November 22, 2024

మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: అచ్చం మనిషిని పోలిన ఎలుగుబంటిని చూసేందుకు చైనాలోని ఒక జూపార్కుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. పశ్చిమ చైనాలోని జీజియాంగ్ ప్రావిన్సులోని ఒక జూలో అచ్చుగుద్దినట్లు మనిషిలా కనిపిస్తున్న ఒక ఎలుగుబంటికి చెందిన వీడియో గత గురువారం ఇంటర్‌నెట్‌లో దర్శనమిచ్చింది.

ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు ఆ వీడియోలోని నిజానిజాలను నిర్ధారిచుకోవడానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు జూకు తరలివస్తున్నారు. గత వారాంతంలో హంగ్‌జౌ జూను సందర్శించే వారి సంఖ్య 30 శాతం పెరిగినట్లు జూ అధికారులు చెబుతున్నారు. గత శని, ఆదివారాల్లో రోజుకు 20 వేల మంది వరకు జూపార్కును సందర్శించినట్లు వారు చెప్పారు. మలయన్ సన్ జాతికి చెందిన ఈ ఎలుగుబంటి పేరు ఏంజెలా. ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఏంజెలా తనను చూడవచ్చిన సందర్శకులను రెండు కాళ్లపైన నిలబడి అచ్చంగా మనిషిలా చూడడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోను వీక్షించిన పలువురు నెటిజన్లు ఇది నిజమేనా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎలుగుబంటి మాదిరిగా సూటు ధరించిన జూపార్కు ఉద్యోగి అయి ఉండవచ్చని కొందరు సందేహం వెలిబుచ్చారు. ఈ వీడియో ఫేక్ అయితే స్పెషల్ ఎఫెక్ట్ చేసిన వారిని ఆస్కార్ ఇవ్వవచ్చని కొందరు వ్యాఖ్యానించారు. అయితే జూపార్కు అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇది అచ్చంగా తమ జూపార్కులోని ఎలుగుబంటేనని, ప్రభుత్వం నిర్వహించే తమ పార్కులో అలాంటి జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదని జూపార్కు అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియోపై మీరూ కాస్త లుక్కేయండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News