Saturday, February 22, 2025

ఆ విషయంలో సచిన్‌ కంటే విరాట్‌కే నా ఓటు: సెహ్వాగ్

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే.. సెహ్వాగ్ బ్యాటింగ్‌కి దిగారంటే తొలి బంతి బౌండరీ దాటేసేది. అయితే సెహ్వాగ్‌కు భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అంటే విపరీతమైన గౌరవం. ఆయనతో కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడిన సెహ్వాగ్ ఎప్పుడు బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరని ప్రశ్నిస్తే.. ముందుగా సచిన్ పేరే చెప్పేవారు. కానీ, ఒక విషయంలో మాత్రం సచిన్ కంటే విరాట్ బెస్ట్ అంటున్నారు సెహ్వాగ్.

అదేంటంటే ఛేజింగ్ విషయంలో విరాట్ సచిన్ కంటే బెస్ట్ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ‘అందరి ఫేవరేట్, నాకు రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్. ఆయనతో మైదానంలో నడుస్తుంటే.. సింహంతో నడిచినట్లు ఉండేది. ప్రతి ఒక్కరి చూపు ఆయనపై ఉండటంతో.. నేను ప్రశాంతంగా బ్యాటింగ్ చేసేవాడిని. కానీ, ఛేజింగ్ విషయంలో మాత్రం సచిన్ కంటే విరాట్‌ కోహ్లీనే బెస్ట్. 2011-12 నుంచి ఇఫ్పటివరకూ కోహ్లీలో చాలా మార్పు వచ్చింది. అతని ఫిట్‌నెస్, నిలకడ అద్భుతం’ అని సెహ్వాగ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News