Wednesday, January 22, 2025

మెట్టు దిగిన బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

ప్రేక్షకుల సమక్షంలో కోహ్లి వందో టెస్టు

Virat Kohli steps down as Test Captain

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) శుభవార్త చెప్పింది. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు విరాట్ కోహ్లికి చాలా ప్రత్యేకమని తెలిసిందే విరాట్ కెరీర్‌లో ఇది వందో టెస్టు మ్యాచ్. అయితే కరోనా నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్ణయించాలని పంజాబ్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విరాట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బిసిసిఐ, పంజాబ్ క్రికెట్ సంఘంపై విమర్శల వర్షం కురిపించారు. కోహ్లిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కీలకమైన ఈ టెస్టుకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదని వారు ఆరోపించారు. ఇక బిసిసిఐ వైఖరీని పలువురు మాజీ క్రికెటర్లు సయితం తప్పుపట్టారు. ఇక అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో బిసిసిఐ నష్ట నివారణ చర్యలకు దిగింది. శుక్రవారం ఆరంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌లో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జైషా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఇక బిసిసిఐ తీసుకున్న నిర్ణయంతో విరాట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరోవైపు టీమిండియాలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లి ఇప్పటికే కెరీర్‌లో 99 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంకతో జరిగే మ్యాచ్ అతని కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌తో టెస్టు తీపి జ్ఞాపకంగా మిగుల్చుకోవాలనే పట్టుదలతో విరాట్ ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News