Monday, December 23, 2024

ఆ రికార్డు తన జీవితంలో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది: కోహ్లి

- Advertisement -
- Advertisement -

ముంబై: తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డును అందుకుంటే తన జీవితంలోనే అది అత్యంత కీలకమైన తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించానని, మరో రికార్డు తనను ఊరిస్తుందన్నాడు. సచిన్ వన్డేల్లో నమోదు చేసిన 49 శతకాల రికార్డును అధిగమిస్తే భావోద్వేగానికి గురి కావడం ఖాయమన్నాడు. సచిన్‌ను ఆదర్శంగా తీసుకునే తన కెరీర్ ఆరంభమైందన్నాడు.

ఇక ప్రపంచ క్రికెట్‌లోనే సచిన్‌ను మించిన క్రికెటర్ లేడనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అలాంటి క్రికెట్ దిగ్గజం పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును అధిగమిస్తే అంతకంటే ప్రత్యేకం మరోకటి ఉండదని విరాట్ అభిప్రాయపడ్డాడు. ఇదిలావుంటే 274 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లి 46 శతకాలు సాధించాడు. సచిన్ రికార్డుకు మూడు శతకాల దూరంలో నిలిచాడు. మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశాలున్న విరాట్‌కు ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యమేమీ కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News