Tuesday, December 24, 2024

బంగ్లాదేశ్ ఆటగాడితో విరాట్ కోహ్లీ వాగ్వాదం (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

చట్‌గావ్: భారత, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ రోమాంచక స్థితిలోకి వెళ్లింది. టెస్ట్ మ్యాచ్ మూడో రోజున భారతీయ టీమ్ 145 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే బంగ్లాదేశీ ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో కంగుతినిపించారు. ఒకరి తర్వాత ఒకరంటూ టాప్ నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపించేశారు. కాగా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ మూడో రోజున ఆఖరి వికెట్ రూపంలో దిగి, ఒకే పరుగుచేసి, మెహదీ హసన్ మిరాజ్ చేతిలో ఔట్ అయ్యారు. దీనికి ముందు కెప్టెన్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్ కూడా ఔటయి పోయారు.

ఔటయ్యాక విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ ఆటగాడితో వాగ్వాదానికి దిగారు. బంగ్లాదేశ్‌కు చెందిన తైజుల్ ఇస్లాం ఔటయ్యాక విరాట్ కోహ్లీని ఏదో అన్నాడు. దాంతో ఆగ్రహానికి గురైన కోహ్లీ అతడివైపు అడుగులేయసాగాడు. అప్పుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షాకిబ్ అల్ హసన్, ఇద్దరు అంపైర్లు వచ్చి విరాట్ కోహ్లీని ఆపారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ , షాకిబ్‌కు ఏదో అంటూ కనిపించారు. ఆ తర్వాత అంపైర్ ఆయనను పెవిలియన్ వైపు వెళ్లమంటూ చెప్పారు.

విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లిపోయాక బంగ్లాదేశ్ కెప్టెన్ షాకిబ్ అల్ హసన్ తమ ప్రముఖ స్పిన్నర్ తైజుల్ ఇస్లాంతో మాట్లాడారు. షాకిబ్ అతడికి ఏదో బోధించడం కనిపించింది. విరాట్ కోహ్లీ 22 బంతులు ఆడి కేవలం ఒకే ఒక పరుగు చేసి ఔటయ్యారు. మెహదీ హసన్ బౌలింగ్‌లో మోమినుల హఖ్ ఆయన క్యాచ్ పట్టారు.

ఔటవ్వడానికి మూడు ఓవర్ల ముందుగానే తైజుల్ ఇస్లాం బౌలింగ్‌పై అంపైర్ విరాట్ కోహ్లీని ఔట్‌గా ప్రకటించారు. కానీ విరాట్ వెంటనే డిఆర్‌ఎస్ తీసుకున్నారు. రిప్లేలో స్పష్టంగా కనిపించిందేమిటంటే బాలు ఆయన బ్యాట్ ఎడ్జ్ గుండా వెళ్లి ప్యాడ్‌కు తగిలింది. దాంతో అతడిని నాటౌట్‌గా నిర్ణయించారు. కానీ దీని తర్వాత విరాట్ కోహ్లీ పెద్దగా ఏమి సాధించకుండానే పెవిలియన్ వెళ్లిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News