Monday, December 23, 2024

మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయాన్ని దర్శించుకున్న విరాట్, అనుష్క

- Advertisement -
- Advertisement -

భోపాల్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ మద్యప్రదేశ్‌లో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయంలో దంపతులు పూజలు చేశారు. పూజారి మంత్రాలు జపిస్తుండగా విరాట్ కూడా మంత్రాలను ఉచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలువడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది. రెండో బెర్త్ కోసం టీమిండియాలో నాలుగో టెస్టులో గెలిస్తే డబ్ల్యుటిసి ఫైనల్‌లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0తో సిరీస్ సొంతం చేసుకుంటే టీమిండియా డబ్ల్యుటిసి ఫైనల్‌లో కనిపించదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News