Sunday, December 22, 2024

ఆరో ర్యాంక్‌కు కోహ్లి..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్10లో చోటు సంపాదించాడు. సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ ఏకంగా నాలుగు స్థానాలను మెరుగు పరుచుకుని పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న విరాట్ మూడు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని ఆరో స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో కోహ్లి ర్యాంక్ మెరుగుపడింది. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కేన్ 864 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. జో రూట్ (ఇంగ్లండ్) 859 పాయింట్లతో రెండో, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) మూడో ర్యాంక్‌లో నిలిచారు. మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా) ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు.

టాప్‌లోనే అశ్విన్
మరోవైపు బౌలింగ్ విభాగంలో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అశ్విన్ 863 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. కగిసొ రబడా (సౌతాఫ్రికా) ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా ఒక ర్యాంక్ పైకి ఎగబాకి నాలుగో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో భారత్‌కే చెందిన జడేజాను వెనక్కి నెట్టాడు. జడేజా ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అశ్విన్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News