Sunday, December 22, 2024

టి20 వరల్డ్ కప్… ఓపెనర్లుగా రోహిత్, విరాట్?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓపెనర్లు ఎవరెవరు ఆడుతారనేది చర్చ జరుగుతోంది. రోహిత్ ఓపెనర్ గా ఉంటాడు, రోహిత్ కు తోడుగా ఎవరిని ఆడిస్తారనే చర్చ జరుగుతోంది. లిస్ట్ లో శుభ్ మన్ గిల్, జైస్వాల్, విరాల్ కోహ్లీలు ఉన్నారు. ఐపిఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ ఓపెనర్ చెలరేగి ఆడుతుండడంతో అతడికి ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

రోహిత్, కోహ్లీ ఓపెనింగ్ చేస్తే గిల్ లేదా జైస్వాల్ కు జట్టులో చోటు ఉండే అవకాశం కనిపించడంలేదు. గిల్ మూడో స్థానంలో ఆడితే సూర్య నాలుగో స్థానం, రింకూ సింగ్, హార్ధిక్ పాండ్యా, జడేజా తరువాత స్థానంల్లో బ్యాటింగ్ చేస్తారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటారు. మరో పేసర్ ఎవరు ఆడుతారనేది సస్ఫెన్షగా మారింది. సిరాజ్ పామ్ కోల్పోవడంతో షమీ, మయాంక్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇంకో బౌలర్ ను ఎవరు తీసుకుంటారు అనేది చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News