Tuesday, December 17, 2024

కోహ్లి మరో రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 25 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ రికార్డును అందుకున్న క్రికెటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు.

ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి తిరగరాశాడు. సచిన్ 577 మ్యాచుల్లో కలిపి కెరీర్‌లో 25 వేల పరుగులను పూర్తి చేశాడు. అయితే కోహ్లి మాత్రం కేవలం 549 మ్యాచుల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి మూడు ఫార్మాట్‌లలో కలిపి 25,102 పరుగులు సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News