Monday, December 23, 2024

కోహ్లిదే ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు

- Advertisement -
- Advertisement -

 

దుబాయి: అత్యుత్తమ ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతి నెలా అందించే ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును ఈసారి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సొంతం చేసుకున్నాడు. ఐసిసి తాజాగా ప్రకటించిన అక్టోబర్ నెలకు సంబంధించి అవార్డును ఈసారి కోహ్లి దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో కోహ్లి అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్న విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు.

ఇతర మ్యాచుల్లో కూడా కోహ్లి బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. ఇక సికందర్ రజా (జింబాబ్వే), డేవిడ్ మిల్లర్ (సౌతాఫ్రికా)లు కూడా అవార్డు రేసులో నిలిచారు. అయితే వీరిని వెనక్కినెట్టి కోహ్లి ఈ అరుదైన పురస్కారాన్ని గెలుచుకున్నాడు. మరోవైపు ఐసిసి అవార్డు వరించడంపై కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమైందన్నాడు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తనకు ఇది ఎంతో ఊరటనిస్తుందన్నాడు. ఇక మహిళల విభాగంలో పాకిస్థాన్ క్రికెటర్ నిదా దార్ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News