Wednesday, January 22, 2025

బ్రిటన్ ప్రధానికి విరాట్ బ్యాట్ గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతుంది. విరాట్‌కు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. తాజాగా విరాట్ సంతకం చేసిన బ్యాట్ బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ గిఫ్ట్‌గా తీసుకున్నాడు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విరాట్ సంతకం చేసిన బ్యాట్‌ను యుకె పిఎం రిషి సునాక్‌కు బహుమతిగా ఇచ్చాడు. జైశంకర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటిస్తున్నారు. రిషి సునాక్‌తో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి రిషి సునాక్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ 594 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసుకున్నాడు. ఇప్పటికే వన్డేలలో 49 సెంచరీలు చేసి సచిన్ రికార్డును విరాట్ సమం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News