Saturday, June 29, 2024

విరాట్‌కు ఏమైంది?

- Advertisement -
- Advertisement -

సెయింట్ విన్సెంట్: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శనతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే జట్టు సెమీస్‌కు చేరినా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. అమెరికాలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లతో పాటు తాజాగా ఆస్ట్రేలియాతో సూపర్8 పోరులో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో కోహ్లి సున్నాకే పెవిలియన్ చేరడం గమనార్హం. దీంతో విరాట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లిని ఓపెనర్‌గా దించడం పెద్ద పొరపాటు నిర్ణయమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అనవసర ప్రయోగంతో జట్టు ప్రయోజనాలు దెబ్బతీశారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపిఎల్‌లో ఓపెనర్‌గా రాణించినంత మాత్రాన అతన్ని వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌లో విరాట్‌కు ఆ అవకాశం ఇవ్వడడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఓపెనర్‌గా రావడంతో విరాట్‌పై ఒత్తిడి నెలకొందని, దీంతో అతను వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News