Friday, December 27, 2024

ప్రపంచ క్రికెట్‌లోనే విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్: మాథ్యూ హేడెన్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ క్రికెట్‌లోనే విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హేడెన్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ అత్యంత నిలకడైన ఆటను కనబరిచే సత్తా ఒక్క కోహ్లికి మాత్రమే ఉందన్నాడు. సమకాలిన క్రికెట్‌లో కోహ్లినే ఉత్తమ బ్యాటర్ అని, అతనికి సాటివచ్చే వారు కనిపించడం లేదన్నాడు.

ఈ ఐపిఎల్‌లోనూ కోహ్లి అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించాడు. 12 మ్యాచుల్లో 634 పరుగులు చేసి సత్తా చాటాడన్నాడు. కాగా, కొంతమంది పనిగట్టుకుని కోహ్లిపై విమర్శలు చేస్తుండడం సరికాదన్నాడు. స్ట్రైక్‌రేట్ చాలా తక్కువ ఉందని అతని బ్యాటింగ్‌ను తక్కువ చేసి చూడడం బాధించే అంశమన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News