Sunday, December 22, 2024

పెరిగిపోతున్న విరాట్ ఆస్తుల చిట్టా.. మరో లగ్జరీ బంగళా కొనుగోలు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: స్టయిలిష్ క్రికెటర్‌గా పేరుపొందిన విరాట్ కోహ్లి ఆస్తుల చిట్టా పెరిగిపోతోంది. స్టయిలిష్, టగ్జరీ బ్రాండ్లకు చెందిన వాణిజ్య ప్రకటనలలో కూడా నటిచే కింగ్ కోహ్లికి బిసిసిఐ నుంచే కాక వ్యాపార ప్రకటనల ద్వారా కూడా బోలెడంత డబ్బు వచ్చి పడుతోంది. తాజాగా కోహ్లి మహారాష్ట్ర లోని అలీబాగ్ పట్టణంలో రూ. 6 కోట్ల విలువచేసే లగ్జరీ బంగళాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆవాస్ విలేజ్ అనే ప్రాజెక్టులో 2000 చదరపు అడుగుల విస్తర్ణంలో ఈ విల్లా ఉంది. విల్లాలోనే 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సంపన్నులు, ప్రముఖులు నివసించే ఈ ప్రాంతం అందమైన ప్రకృతి సంపదతో కనువిందు చేస్తుంటుందని చెబుతారు. అలీబాగ్‌లో విరాట్ కొనుగోలు చేసిన రెండవ ఆస్తి ఇది. రూ. 20 కోట్లతో గతంలోనే ఆయన ఇక్కడ షార్మ్ హౌస్‌ను కొనుగోలు చేశారు.

విరాట్ ఆయన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల కాలంలో చాలా స్థిరాస్తులు పోగేశారు. ముంబైలోని బొర్లిలో ఓంకార్ అనే త్రీ టవర్ కాంప్లెక్స్‌లోని 35వ అంతస్తులో విరాట్ దంపతులకు ఒక లగ్జరీ టఫ్లాట్ ఉంది. దీని విలువ రూ. 34 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ లగ్జరీ హోమ్‌లో సకల సౌకర్యాలు ఉంటాయట.

దేశ రాజధాని ఢిల్లీ శివర్లాలోని గురుగ్రామ్‌లో కూడా విరాట్‌కు ఒక విలాసవంతమైన బంగళా ఉంది. ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే ఇది విరాట్ అన్ని ఆస్తులలో తలమాణికంగా నిలుస్తుందని అంటారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ బంగళా విలవ కొన్ని వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వారట్ తన భార్య, కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి సేదదీరుతుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News