టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డులకు పెట్టింది పేరు. ఇప్పటికు ఎవరికి సాధ్యం కానీ రికార్డులను తన పేరిట రాసుకున్నాడు కోహ్లీ. అయితే ఇప్పుడు మరో రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడుు కోహ్లీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మార్చి 22న కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు కసరత్తులు చేస్తున్నాయి.
అయితే ఈ సీజన్‌లో కోహ్లీ మరో అరుదైన రికార్డును అందుకొనే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో మరో సెంచరీ చేస్తే.. టి-20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసి భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. ఈ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలోనే ఉన్నాడు. ఇప్పటికే కోహ్లీ 399 మ్యాచుల్లో 9 సెంచరీలు చేయగా.. రోహిత్ శర్మ 448 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు చేశాడు. కోహ్లీ ఎనిమిది సెంచరీలు ఐపీఎల్‌లో చేయగా.. 1 సెంచరీ అంతర్జాతీయ క్రికెట్‌లో చేశాడు. ఈ సీజన్‌లో ఒకటి లేదా ఎక్కువ సెంచరీలు చేస్తే.. కోహ్లీ తన రికార్డును తానే బ్రేక్ చేసే అవకాశం ఉంది.